Thursday 26 January 2023

 

     # ఆమె నిన్న ఒక మాట అంది 

ఆమె వేసిన మెలికల ముగ్గు గుమ్మంలో తెల్లటి తివాచి
ఆమె పాటలువంటఇంటి గోడలకి చిత్రపటాలు
ఆమె పెంచిన మొక్కలమీద పసుపురంగు సీతాకోక చిలుకలు
ఆమె ఇల్లుతీర్చి దిద్దిన కూటిరం
ఆమె సామాన్య గృహిణి
ఆమె కళలు ఆమెవి
ఆమె ఎవరికీ చెందని మనిషి
ఆమె నిన్న ఒకమాటఅంది
ప్రేమ లోకం చాలా అందంగా
కొత్త ఉత్సాహం నింపుతోంది
ప్రేమ లో ఇంత అనందం ఉందా అడిగింది
ఇప్పుడు ప్రపంచం అంతా ఆమెవైపు తిరిగింది
ఆమె వయసుకి లెక్కలు కట్టడంలో మునిగిపోయింది
ఆమె కట్టు బొట్టు నడక నవ్వు అన్నీ విమర్శ సంచిలోంచి బయటికి పడిపోతున్నాయి
ఆమె ఇప్పుడువాళ్ళచేతి అద్దం..

No comments:

Post a Comment